Header Banner

కాణిపాకం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్! ఇకనుండి అది తప్పనిసరి!

  Sun May 11, 2025 10:43        Devotional

తెలుగు రాష్ట్రాల్లోని మహిమాన్విత క్షేత్రాల్లో ఏపీలోని చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఒకటి. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి దర్శిస్తారు. ఇక వేసవి సెలువుల్లో అయితే రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ ఆలయానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.

 

 

కాణిపాకం ఆలయంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో భక్తులు అధికంగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే తాజాగా కాణిపాకం ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు కీలక సూచన చేశారు. వీఐపీ దర్శనం టికెట్ ధరను రూ.300 లకు పెంచాలని నిర్ణయించారు.

 

ఇది కూడా చదవండి: తిరుమల భక్తుల రద్దీ పై లేటెస్ట్ అప్డేట్! వారికి 2-3 గంటల్లోనే దర్శనం!

 

కాణిపాకం ఆలయంలో వీఐపీ దర్శనం టికెట్ ధరను రూ.300 లకు పెంచాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన అనుమతి కోసం కమిషనర్‌కు ఆలయ కమిటీ సభ్యులు ప్రతిపాదనలు పంపారు. అలాగే.. సిఫార్సులతో వచ్చే భక్తులకు ఇకపై టికెట్ తప్పనిసరి చేసింది. ఆలయ ఉద్యోగులు కూడా టికెట్లు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆలయ ఈవో పెంచల కిషోర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.


ఇక కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ప్రస్తుతం సర్వదర్శనం టికెట్స్ రూ.100, రూ.150 భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు. సిఫార్సులపై వచ్చే భక్తులకు ఆలయ ఉత్తర భాగంలోని వీఐపీ ద్వారం వద్ద రూ.150 టికెట్‌ ఇస్తున్నారు. తాజా నిర్ణయం ప్రకారం ఇకపై వీఐపీ ద్వారం గుండా దర్శనానికి వెళ్లే భక్తులకు టికెట్‌ ధర రూ.300 గా తీర్మానించారు.



ఇది కూడా చదవండిఏకంగా రూ.70 లక్షల లంచం...! ఐఆర్ఎస్ అధికారిని అరెస్ట్ చేసిన సీబీఐ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KanipakamTemple #VarasiddhiVinayaka #KanipakamDarshan #ChittoorTemples #AndhraTemples